ఐబీఎఫ్‌ ఆధ్యక్షుడిగా మన్‌జిత్‌ సింగ్‌

ముంబయి: ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ (ఐబీఎఫ్‌) అధ్యక్షుడిగా మల్టీ స్క్రీన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో మన్‌జిత్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సునిల్‌ లుల్లా (టైమ్స్‌ టీవీ నెట్‌వర్క్‌), రజత్‌శర్మ (ఇండియా టీవీ), పునిత్‌ గోయెంకా (జీ న్యూస్‌) ఎన్నికయ్యారు. శనివారం నిర్వహించిన ఐబీఎఫ్‌ వార్షక సర్వసభ్య సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు.