ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సుఖేందర్ రెడ్డి ఓ

బిజెపి సీనియర్ నాయకులు ఒరుగంటి రాములు  పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి . వారి కుటుంబ సభ్యులను సుఖేందర్ రెడ్డి ఓదార్చి , ధైర్యం చెప్పారు. ఒరుగంటి రాములు ప్రజలకు ఎనలేని సేవ చేసారని ఆయన మృతి చాలా బాధాకరమని, ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పార్టీలు వేరైన ప్రజల అవసరం కోసం ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకువచ్చి ఆ పని అయ్యేవరకు రాములు గారు వెంటపడేవారని ఆయన చెప్పారు. రాములు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమములో మాజీ మున్సిపల్ చైర్మన్,BRS నాయకులు, బోయనపల్లి కృష్ణా రెడ్డి,యమా దయాకర్,మందడి మధుసుదన్ రెడ్డి,హరి కృష్ణ,రిటైర్డ్ వార్డెన్ ఇంద్ర సేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.