కాంగ్రెస్, ఎన్‌సీపీల మధ్య ముగిసిన చర్చలు
న్యూఢిల్లీ: యూపీఏలో కీలక భాగస్వాములైన కాంగ్రెస్, ఎన్‌సీపీల మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. భవిష్యత్తులో ఇరు పార్టీల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడితే పరిష్కరించేందుకు సమన్వయకమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసకున్నారు. ప్రధాని నివాసంలో జరిగిన చర్చల్లో ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఎన్‌సీపీ నేతలు శరద్‌పవార్, ప్రఫుల్ పటేల్‌లు పాల్గొన్నారు.