కాబూల్‌లో ఆత్మాహుతి దాడి 12 మంది మృతి

కాబూల్‌, సెప్టెంబర్‌ 18:
అఫ్ఘానిస్తాన్‌ మరోసారి రణరంగమైంది. మంగళవారం తెల్లవారుజామున జరి గిన ఆత్మాహుతి దాడిలో 12 మంది దుర్మరణంచెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు విదేశీయులు కూడా ఉన్నారు. కాబూల్‌ విమానా శ్రయానికి విదేశీయులను తీసు కెళ్తున్న మినీ బస్సుపై ఆత్మాహుతి దళ సభ్యురాలు దాడికి పాల్పడింది. పెట్రోల్‌ స్టేషన్‌కు ఎదురుగా జరిగిన ఈ దాడి తీవ్రతకు బస్సు యాభై విూటర్ల ఎత్తుకు ఎగిరిపడింది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ఈ దాడికి పాల్పడింది తామేనని హజ్‌బు-ఈ-ఇస్లావిూ సంస్థ ప్రకటించింది. మహమ్మద్‌ ప్రవక్తను చులకన చేస్తూ, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఆంగ్ల చిత్రం నిర్మించినందుకే ఈ దాడి చేసినట్లు తెలిపింది. చిత్రానికి వ్యతిరేకంగా.. బాంబులతో కూడిన జాకెట్‌ ధరించిన
ఓ మహిళా బస్సు సవిూపంలోకి వచ్చి తనను తాను పేల్చుకున్నట్లు ఉగ్రవాద సంస్థ ప్రతినిధి జుబేర్‌ సిద్ధిఖీ తెలిపారు. మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించారు. ఇస్లాంకు వ్యతిరేకంగా తీసిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చిత్రాన్ని నిరసిస్తూ.. గత వారం లిబియాలోని అమెరికా దౌత్య కార్యాలయంపై పలువురు దాడిచేసి, దౌత్యాధికారి సహా మరో ముగ్గురిని హతమార్చారు. నాటో దళాలకు చెందిన మిలిటరీ బేస్‌పై సోమవారం దాడి జరిగింది. పలు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు, అఫ్ఘన్‌ రాజధానిలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్లు, ఇతర వాహనాలు తుగలబెట్టారు. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు.