కారు-లారీ ఢీ.. ముగ్గురి మృతి

ఉంగుటూరు: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద కారు. లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.