కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని మెట్రో వద్ద ఓ దుకాణంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దుకాణం పక్కనే పెట్రోలు బంకు ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.