కెనడాలో భారీ భూకంపం

ఒట్టావో: కెనడా పశ్చిమ తీర ప్రాంతంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. బ్రిటీష్‌ కొలంబియాలోని మస్సెట్‌కు దక్షిణాన 155 కొలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌ జియలాజికల్‌ సర్వే అధికారులు తెలియజేశారు.