గణనాథుడి పూజలో పాల్గొన్న కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగరావు….

కూకట్ పల్లి (జనంసాక్షి): వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగరావు శనివారం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ 34,35 బ్లాక్,వీకర్ సెక్షన్,రోడ్ నెంబర్ 8,రామకృష్ణ నగర్, రిక్షా పుల్లర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి,గొట్టిముక్కుల పెద్ద భాస్కరరావు,కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.