గాంధీజీ – హెర్మాన్‌ ఉత్తరాల సేకరణ

1.28 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు
న్యూఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన విలువైన పత్రాలు, వస్తులు, కళాఖండాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర సాంస్కృతిక, గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కుమారి సెల్జా చెప్పారు. సమరయోధులకు చెందిన సామగ్రిని నేషనల్‌ ఆర్కైప్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏఐ)లో భద్రపరుస్తామని తెలిపారు. తాజాగా మహాత్మాగాంధీ, ఆయన సన్నిహితుడు, జర్మనీ వాస్తుశిల్పి హెర్మాన్‌ కలెన్‌బాచ్‌ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, ఇతర వస్తువులు లండన్‌లో వేలానికి వచ్చాయని వెల్లడించారు. వీటిని వేలం నుంచి తప్పించి, 1.28 మిలియన్‌ డాలర్ల (825,250 పౌండ్లు)కు భారత్‌కు విక్రయించేందుకు హెర్మాన్‌ కుటుంబసభ్యులు అంగీకరించారని పేర్కొన్నారు. చారిత్రకంగా అత్యంత విలువైన ఈ పత్రాలను త్వరలో భారత్‌కు తీసుకోస్తామన్నారు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు హెర్మాన్‌ కలెన్‌బాచ్‌తో సన్నిహితంగా మెలిగేవారు.