గాంధీభవన్‌ ముట్టడికి యత్నం

హైదరాబాద్‌ : నేడు తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తున్న తెలంగాణ రాజకీయ ఐకాస గాంధీభవన్‌ను ముట్టడించేందుకు యత్నం చేసింది. ఐకాస అధ్యక్షుడు కోదండరామ్‌ మరికొందరు నేతలు గాంధీభవన్‌ ఎదుట బైఠాయించి ధర్నాకు యత్నించారు. దీంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.