గాంధీ ఆసుపత్రిలో కుక్కల దాడి..

 సికింద్రాబాద్ : ప్రముఖ గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం కుక్కలు స్వైర విహారం చేశాయి. చికిత్స నిమిత్తం వచ్చిన రోగులు కుక్కల బారిన పడ్డారు. దీనితో రోగులు కుక్కల గాట్లతో అవస్థలు పడ్డారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్కాజ్ గిరి వాసి చికిత్స కోసం గాంధీకి వచ్చాడు. ఆయనకు తక్షణం వైద్య సహాయం అందించాల్సి వైద్యులు బాధితుడిని చేర్చుకోలేదు. దీంతో ఒంటినిండా గాయాలతో కదల్లేని స్థితిలో ఉన్న బాధితుడు ఆస్పత్రి ఆవరణలోనే పడిపోయాడు. అక్కడే ఉన్న కుక్కలు అతడిని కరిచాయి. తీవ్రగాయాలకు గురైన అతడికి వైద్యులు చికిత్స అందించారు. కుక్కల దాడితో రోగులు పరుగులు తీశారు. కుక్కలను అరికట్టాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.