గాలి బెయిలు వ్యవహారం గుట్టువిప్పిన రవిచంద్ర

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు వ్యవహారంలో మరో కోణాన్ని పట్టాభి కుమారుడు రవిచంద్ర బయట పెట్టాడు. చలపతిరావు బేరం కంటే ముందే తమను రాష్ట్ర ఎన్నికల సంఘంలో న్యాయాధికారిగా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు తమను సంప్రదించాడని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. గాలికి బెయిల్‌ మంజూరు చేయిస్తే రూ.10కోట్లు ఇస్తామని ఆశ చూపాడన్ని వివరించారు.ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని ఆశచూపాడాన్ని, మంజూరు చేసేలా తన తండ్రిపై ఒత్తిడి తేవాలంటూ పలుమార్లు ఫోన్లు కూడా చేశాడని చెప్పాడు. ఈ అవకాశాన్ని వదులకోవద్దంటూ ఆయన వ్యక్తిగత సెల్‌ఫోన్ల నుంచి తనకు, తన తండ్రికి పలుమార్లు ఫోన్లు చేశాడని తెలిపారు. అయితే రెండు రోజుల అనంతరం విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు తన ఫోన్‌ద్వారా ఈ విషయమై తన తండ్రితో తరచూ మాట్లాడారని చెప్పుకొచ్చారు. బెయిల్‌ మంజూరుకు ఒక్కరోజు ముందు మసాబ్‌ట్యాంక్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌ వద్ద నిలిపి ఒప్పందం గురించి తనతో మాట్లాడినట్లు చెప్పాడు. మే 11న గాలికి బెయిల్‌ మంజూరుచేసిన తన తండ్రి రిస్కు తక్కువని చలపతిరావు తీసుకొచ్చిన ఒప్పందాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు. బెయిల్‌కు రూ.10కోట్లంటూ మొత్తం రిస్కు తక్కువని ఈ బేరాన్ని అంగీకరించినట్లు తన తండ్రి తనకు చెప్పారని రవిచంద్ర తన నేరాంగీకారపత్రంలో పేర్కొన్నాడు. ఈ మొత్తాలన్నీ ఖైరతాబాద్‌ ఐఎన్‌జీవైశ్యా బ్యాంకు, అశోక్‌నగర్‌లోని కార్పోరేషన్‌ బ్యాంకులలో దాచి తమకు తాళాలు మాత్రమే ఇచ్చారని ఒప్పుకున్నాడు.