గిన్నిస్‌ బుక్‌కెక్కిన ప్రపంచంలోనే పెద్ద పాఠశాల

లక్నో: 1959లో జగరీశ్‌, భారతీ గాంధీ అనే దంపతులు నెలకొల్పిన లక్నోలోని సిటీ మాంటెస్సొరి పాఠశాలలో 2010-11 విద్యాసంవత్సరానికి రికార్డు సంఖ్యలో 39 వేల 437 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద పాఠశాలగా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. పాఠశాలలో 45 వేల పైచిలుకే విద్యార్థులున్నారని యాజమాన్యం తెలిపింది. 2002లోనే ఈ పాఠశాల పీస్‌ ఎడ్యుకేషన్‌కి యునెస్కో బహుమతిని అందుకుంది. ప్రపంచంలో ఈ బహుమతి అందుకున్న పాఠశాల ఇదొక్కటే కావడం విశేషం. 2013 గిన్నస్‌ బుక్‌ ఎడిషన్‌లో ఈ పాఠశాల విశేషాలు ప్రచురించనున్నారు.