గీత కార్మికులను కల్లును హైదరాబాద్‌లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలి

హైదరాబాద్‌: గీత కార్మికులను హైదరాబాద్‌లో కల్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గౌడ సంఘం నేతలు తెలిపారు. గీత కార్మికులపై వృత్తిపన్ను ప్రభుత్వం ఎత్తివేసిందని త్వరలో హైదరాబాద్‌లో గీత కార్మికుల సదస్సు నిర్వహించి మిగితా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు.