గుంటూరులో ప్రారంభమైన ఈ-గ్రంథాలయం

గుంటూరు: సామాజిక అభివృద్ది కార్యక్రమాల అమలులో భాగంగా గుంటూరు నగరపాలక
సంస్థ ఓ మంచి ముందడుగు వేసింది. 12లక్షల రూపాయల వ్యయంతో
ఈ-గ్రంథాలయం నెలకొల్పింది. రాష్ట్రంలో ఈ తరహ గ్రంథాలయాలున్న కార్పోరేషన్‌
గుంటూరు ఒక్కటే కావడం విశేషం. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ
ఈ-లైబ్రరిని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. మారుతున్న సమాజంలో ఇప్పుడు
అంతర్జాల సేవలు అత్యవసరంగా మారాయి. ఉద్యోగార్థులు దరఖాస్తులనూ ఇంటర్నెట్‌లో పూర్తిచేసి పంపాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరికీ ప్రయోజనం కలిగేలా గుంటూరులో రెండు చోట్ల ఈ- గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్‌ బ్రాడ్‌బ్యాండు కనెక్షన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తీసుకున్నారు. రెండు కేంద్రాల్లోనూ
కంప్యూటర్లు, యూపిఎస్‌ సౌకర్యాలు అమర్చారు. మరో రెండున్నర లక్షలతో ఫర్నిచర్‌, ఏసీ
సౌకర్యాలు ఏర్పాటు చేశారు.