గుడిమల్కాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌: గుడిమల్కాపూర్‌ శివబాగ్‌ చౌరస్తాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతున్ని సబ్జిమండికి చెందిన విద్యానంద్‌గా గుర్తించారు. పాత కక్షలే ఈ ఘటనకు కారణం తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్మాప్తు చేపట్టారు.