గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 13 లక్షల విలువైప నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు పాతబస్తీ, మలక్‌పేట, సైదాబాద్‌ల్లో చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలియజేశారు.