గ్రంథాలయ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి..

 ఆదివాసీల నాయకుల డిమాండ్..
బేల, సెప్టెంబర్ 1 ( జనం సాక్షి) : ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా ఏజెన్సీ చట్టలకు విరుద్ధం వ్యవహరిస్తున్న ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ తన పదవికి రాజీనామా చేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు.  ఆదివాసీ సంక్షేమ పరిషత్  ఆధ్వర్యంలో గురువారం  మండల కేంద్రంలోని కొమురం భీం చౌక్ లో ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్  మండల అధ్యక్షులు ఆడా శంకర్ మాట్లాడుతూ గ్రంథాలయ చైర్మన్ కేవలం తన బంధువుల రెండు ఇళ్ల కోసం లక్షల రూపాయలతో రోడ్డు, మురికి కాలువలు నిర్మించారని  ఆరోపించారు.ఆదివాసుల గుడాలు వందల సంవత్సరం నుంచి ఉన్నాయి.అక్కడ కనీస సౌకర్యాలు  రోడ్లు,మురికి కాలువలు, విద్యుత్, వైద్యం లేవు  కానీ 1/70 చట్టానికి విరుద్ధంగా వేసిన లేవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పిచడం ప్రజాధనం వృధా చేయడమేనాని అన్నారు. ఆదివాసుల ఓట్ల తో గెలచి ఆదివాసులు చట్టాలను నాశనం చేస్తున్న గ్రంథాలయ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు . దీనికి సహకరించిన బేల ఎంపిఓ ని వెంటనే సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షులు నైతం సీతారాం,  చందర్ షా,గౌరవ అధ్యక్షులు మాడవి సకారం, ప్రధాన కార్యదర్శి కోరంగే జంగషౌ, ఆత్రం ఫక్రు  తదితరులు పాల్గొన్నారు.