గ్రూప్ 4 విద్యార్థిని బలవన్మరణం

దంతాలపల్లి ఫిబ్రవరి 17 (జనం సాక్షి)
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని గ్రూప్ 4 లో మార్కులు తక్కువ వచ్చాయని హైదరాబాద్ కేంద్రంలోని జవహర్ నగర్ లో ప్రైవేటు హాస్టల్లో ఉంటూ గ్రూప్ ఫోర్త్ కు ప్రిపేర్ అవుతూ తల్లిదండ్రులకు పేరు తేవాలని ఆశించిన ఆమె గ్రూప్ 4 లో మార్కులు తక్కువ రావడంతో ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానికి శుక్రవారం సాయంత్రం పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల గ్రూప్ 4 లో ఫలితాలను విడుదల చేయగా తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన శిరీష (24) హాస్టల్లోనే ఫ్యాన్ కి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామమైన పెద్ద ముప్పారం గ్రామం లో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.