చంద్రబాబుతో పోటీపడే సత్తా జగన్‌కు లేదు

వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తాం: రామ్మోహన్‌ నాయుడు
శ్రీకాకుళం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  ప్రతిపక్ష నేత జగన్‌కు సీఎం చంద్రబాబుతో పోటీపడే సత్తా లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి రావాలంటే యువత కదనరంగంలోకి దిగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. చంద్రబాబు పేరు రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని చెప్పారు./ూనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఘన విజయం అందివ్వడానికి ఎదురుచూస్తున్నారని.. రాష్ట్రంలో 150 స్థానాలు దక్కించుకోవడం ఖాయమని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసిందని నాలుగు గోడల మధ్య, జనసవిూకరణ సభల్లో ప్రశ్నించడం కాదని.. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు చెబుతారని ఆయన చెప్పారు. తన స్వలాభం కోసం తప్ప రాష్ట్రం గురించి ఏరోజు ఆలోచించని జగన్మోహన్‌రెడ్డి అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్ర కేబినెట్‌లో తొమ్మిది మంది బీసీ మంత్రులు ఉంటే ఇంకా ఏవిూ చేయలేదనడం ప్రజలను మోసగించడమేనన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన వెనుకబడిన తరగతులకు స్వర్ణయుగమని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభిమానం చూరగొంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెదేపా వెన్నెముక బీసీలే అని తెలుసుకున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి వారిలో లేనిపోని సమస్యలు సృష్టించేందుకు చేస్తున్న కుటిల యత్నాలు ఫలింఛవన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి వస్తున్న ఆదరణ చూసి జగన్మోహన్‌రెడ్డికి భయం పట్టుకుందని.. అందుకే బీసీల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెనుకబడిన తరగతులు సంతోషంగా ఉండడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడే అన్నారు.