చిలుక వాగు కబ్జారాయులపై చర్యలు తీసుకోవాలి.
కాలనీలో నీరు నిలవకుండా పునరుద్ధరించా లి.
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్.
తాండూరు సెప్టెంబర్ 4(జనంసాక్షి)చిలుక వాగు కబ్జాదారులపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని బిజెపి వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ డిమాండ్ చేశారు.శనివారం రాత్రి కురిసిన వర్షానికి తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 13 మిత్ర నగర్ కాలనీ వరద నీటితో పూర్తిగా జలమయమై కాలనీ వాసులు రాత్రి జాగరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడి ఇబ్బందులకు గురయ్యారు .ఆదివారం ఉదయం ఇంట్లోకి చేరిన నీటిని తోడేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ బీజేపీ నాయకులతో కలిసి మిత్ర నగర్ కాలనీ సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ప్రత్యక్షంగా చూశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని గంటల పాటు కురిసిన వర్షానికి మున్సిపల్ పరిధిలోని మిత్ర నగర్ నీటిలో మునగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిఇలా ఉండే రానున్న రోజులో ఎలా ఉంటుందోనని వమర్శించారు.కాలనీ ప్రజలు పలుమార్లు అధికారులకు ప్రజాప్రతిని ధులకు సమాచారం అందించిన కూడా ఇంతవరకు పరమాశించిన పాపాన పోలేదని మండిపడ్డారు.కాలనీ గుండా వెళ్లే చిలుక వాగు కొందరు కబ్జాదారుల కారణంగా నాలా మొత్తం కబ్జాకు గురైందని అన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే చిలుకలవాగు కబ్జాదారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్కడున్నా కాలనీలో నిరు నిలవకుండా చూడాలని అన్నారు.అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలని లేదంటే కాలనీవాసులకు అండగా ఉండి ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బంటారం భద్రేశ్వర్, భాను పవర్, విక్కిరెడ్డి, మహేష్ కందనెల్లి, కాలనీవాసులు దీపక్, ప్రతాప్ సింగ్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.