జంటనగరాల పర్యటనకు మరో నాలుగు బస్సులు

హైదరాబాద్‌: జంటనగరాల్లో పర్యాటన స్థలాల సందర్శనకు వీలుగా పర్యాటక శాఖ మరో నాలుగు కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టింది. వీటిని మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద ఉన్న బస్‌ షెల్టర్‌ నుంచి లాంఛనంగా ప్రారంభించారు. చారిత్రక కుతుబ్‌షాహీ సమాధుల నుంచి సికింద్రాబాద్‌ పర్యాటకభవన్‌ వరకూ ఉన్న పర్యాటక ప్రాంతాల్ని ఈ నాలుగు బస్సులూ ప్రతి రోజూ చుట్టివస్తాయి. వీటి టికెట్‌ ధర పెద్దలకు రూ.250, పిల్లలకు 200గా నిర్ణయించారు. వీటిలో ప్రయాణించేవారు మధ్యలో ఏ పాయింట్‌ వద్దనైనా ఆగి అదే టికెట్‌పై అదే రోజు తర్వాత బస్సుల్లోనూ వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వట్టి వసంతకుమార్‌ జంటనగరాల వాసుల్ని కోరారు.

తాజావార్తలు