జగన్‌కు ప్రధాన కోవర్టు ముఖ్యమంత్రే-అవినీతి మంత్రులను తొలగించకపోతే ఉద్యమం:టీడీపీ

హైదరాబాద్‌:  రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌కు ప్రధాన కోవర్టని టీడీపీ సీనియర్‌నేత కోడెల శివప్రసాద్‌ నర్సాపురంలో అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సుఫ్రీంకోర్టు నోటీసులు జారీచేస్తే ప్రభుత్వం న్యాయసహాయం అందించేందుకు ముందుకు రావటం విడ్డురంగా ఉందని ఆయన తప్పుపట్టారు. అవినీతి మంత్రులను తొలగించకపోతే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.