జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కొడాలి నాని
హైదరాబాద్ : కృష్ణా జిల్లా ఎమ్మెల్యే కొడాలి నాని ఈరోజు చంచల్‌గూడ జైలులో జగన్‌ను కలిశారు. జగన్ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానిపై తెదేపా సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసిన నాని అనంతరం జైలులో జగన్‌ను కలిశారు.