జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం.

బెల్లంపల్లి, మార్చి 1, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 161వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం మామిడి సరిత దినేష్ కుమార్ దంపతులు దయాస్ మెన్స్ వేర్, బెల్లంపల్లి సహకారంతో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 180 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాత మామిడి సరిత దినేష్ కుమార్ దంపతులు,జనహిత సేవా సమితి నిచ్చకోలా గురుస్వామి, ముక్త రాజన్న, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.