జుక్కల్ లో ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ నాగల్ గిద్దే శివానంద్, మాజి ఎంపిపి బస్వంత్ రావ్ శెట్కార్, ప్రతిభ విద్యానికేతన్ (జుక్కల్) యజమాని చంద్రకాంత్,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు మాధవ్ రావ్ దేశాయ్, టిఆర్ఎస్ నాయకులు నీలు పాటిల్,
రవి పటేల్, పండరి, శివాజి పటేల్, సతీష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.