జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష

హైదరాబాద్‌: అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ సివిల్‌ జడ్జీల అవగాహన పరీక్ష నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారని నిర్వాహకులు తెలియజేశారు. త్వరలో ప్రభుత్వం నిర్వహించనున్న జూనియర్‌ సివిల్‌  జడ్జి పరీక్షకు ఈ  అవగాహన పరీక్ష చాలా ఉపయోగపడుతుందిని హైదరాబాద్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ అన్నారు.