టిఆర్ఎస్ కార్యాలయంలో గణపతి పూజ
కూకట్ పల్లి ( జనంసాక్షి ):వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు వారి కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.గణపతి పూజను ప్రశాంతంగా జరుపుకుని ప్రజలందరూ ఆయురోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కురుమయ్య గారి సత్యం, టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.