ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ కుట్ర..

` ఖండిరచిన టెహ్రాన్‌
టెహ్రాన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌ కుట్ర పన్నిందని..దాన్ని ఎఫ్‌బీఐ అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఇరాన్‌ ఖండిరచింది. ఇవి ఇరుదేశాల మధ్య సంబంధాలను క్లిష్టతరం చేసేవిగా వెల్లడిరచింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాకీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.’మా అధ్యక్షుడు ప్రమాణస్వీకారానికి హాజరైన సమయంలో హమాస్‌ చీఫ్‌ హనియే హత్య గుర్తుందా? అది ఎవరు, ఎందుకు చేశారో అందరికీ తెలుసు. ఇప్పుడు అమెరికాలో ఎన్నికలు జరగగానే మరో లక్ష్యాన్ని రూపొందించారు. హంతకుడు ఇరాన్‌లో కూర్చుని ఎఫ్‌బీఐతో ఆన్‌లైన్‌లో మాట్లాడుతున్నారనేదాన్ని ఎవరు నమ్ముతారు? అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు తమ నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని ఇరాన్‌ గౌరవిస్తుంది. రెండు వైపుల నుంచి విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అవసరం’ అని అరాకీ రాసుకొచ్చారు. మరోవైపు ట్రంప్‌ హత్య కుట్రలో ఇరాన్‌ ప్రమేయాన్ని విదేశాంగ ప్రతినిధి ఎస్మాయిల్‌ బఘై సైతం ఖండిరచారు. అమెరికా న్యాయశాఖ నివేదిక పూర్తి నిరాధారమైనదిగా అభివర్ణించారు. గతంలోనే తమపై ఇలాంటి ఆరోపణలు చేశారని, వాటిని సైతం తాము తీవ్రంగా ఖండిరచామన్నారు. ఇరుదేశాల మధ్య సమస్యలను మరింత క్లిష్టతరం చేయడానికి జియోనిస్ట్‌, తమ వ్యతిరేక వర్గాలు ఈ రకమైన కుట్రలు రూపొందిస్తున్నారన్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌ కుట్ర పన్నిందని.. దాన్ని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) అధికారులు భగ్నం చేశారని అమెరికా న్యాయ విభాగం తెలిపింది. ఈ మేరకు మన్‌హట్టన్‌లోని ఫెడరల్‌ కోర్టులో అభియోగాలను నమోదు చేసింది. ఇందులో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి (ఐఆర్‌జీసీ)కి చెందిన ఓ గుర్తు తెలియని అధికారిని కూడా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ చేర్చింది. ఈ కుట్రలో పాల్గొన్న మరో వ్యక్తి పేరును ఫర్జాద్‌ షకేరీగా పేర్కొంది. ఇరాన్‌లో ఉంటున్న షకేరీ అమెరికాలో తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను ఈ హత్య ప్రణాళికను అమలు చేసేందుకు ఎంపిక చేసుకున్నాడని ఎఫ్‌బీఐ పేర్కొంది. వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడిరచింది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగానే ట్రంప్‌ను హత్య చేయాలని తమకు సూచనలు అందాయని, తర్వాత ప్రణాళిక మారిందని షకేరీ తెలిపినట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.