డబల్ ఇండ్ల కై ఎవరు డబ్బులు ఇవ్వద్దు.

..

– నిబంధనలు పాటించి ఇసుక రవాణా చేయాలి.

భైంసా రూరల్ మార్చ్ 14 జనం సాక్షి

డబల్ బెడ్రూమ్స్ ఇప్పిస్తామంటూ మోసపూరిత ప్రకటనలు నమ్మి డబ్బులు ఎవరికీ ఇవ్వద్దంటూ బై0సా మండల తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది పేర్కొంది.ఈ ఇండ్లు తమతమ అర్హత ను బట్టి మీకు కేటాయించడం జరుగుతుందని, వచ్చిన దరఖాస్తుల పై సంబంధిత అధికారులు విచారణ చేయుచున్నారని పేర్కొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ నిర్మల్ ఆదేశాల ప్రకారమే ఇసుక రవాణా చేసుకొవాలని,ఎవరికైనా ఇసుక అవసరమున్నచో ఈ కార్యాలయము బ్యాంక్ అకౌంట్ లో రూ. 801.00 జమ చేసి ఈ కార్యాలయములో సమర్పించి ఇసుక రవాణా పత్రము పొందగలరని,లేని ఎడల అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని రుసుము విధించబడునని పేర్కొన్నారు.