డీఎస్సీ చలానా గడువు పొడగింపు

హైదరాబాద్‌: డీఎస్సీ చలానా గడువును పొడగించినట్లు మంత్రి పార్థసారథి తెలియజేశారు.ఈ నెల 19 వరకు డబ్బులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించుటకు చివరి తేదీ జూలై 20.ఈ నెల 19లోగా ఫలితాలు వచ్చిన డీఈడీ,బీఈడీ అభ్యర్థులకు దరఖాస్తు సమర్పించుకునేందుకు అవకాశం ఇస్తామని ఆయన అన్నారు. డీఎస్సీ పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.