డ్రగ్స్ నిర్మూలనకు లైన్స్ క్లబ్ చేయూత

దేశానికి రెండు కళ్ళు
టీచర్లు, జర్నలిస్టులకు సన్మానం
లైన్స్ క్లబ్ మాజీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్. రవీందర్ గౌడ్ జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ శుక్రవారం
ప్రపంచ దేశాలలో డ్రగ్స్ మాఫియా వ్యవస్థ విస్తరించిన నేపథ్యంలో దానిని రూపుమాపడానికి ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్స్ క్వెస్ట్ అనే నినాదంతో కళాశాలలు, పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఎస్. రవీంద్ర గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జోగిపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం, జర్నలిస్టు డేలను పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులు, జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డ్రగ్స్ మహమ్మారి సంస్కృతి మన దేశానికి విస్తరించిందని, ముఖ్యంగా కాలేజీలు పాఠశాలలో టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా పని చేస్తుందన్నారు. యువతను డ్రగ్స్ వైపు మళ్లిస్తూ వారి విలువైన జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. దీనిని నిర్మూలించేందుకు లైన్స్ క్లబ్ ఆయా కళాశాలలు, పాఠశాలల్లో బోధన సిబ్బందికి అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వాలతోపాటు లైన్స్ క్లబ్ ఈ మహమ్మారి నిర్మూలనకు ముందుకు వచ్చిందన్నారు. ఇప్పటికే కాలేజీలలో లైన్స్ క్లబ్ అనుబంధంగా విద్యార్థులు సేవా కార్యక్రమాలపై మక్కువ పెంచుకునేందుకు లియో క్లబ్బులను ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఉపాధ్యాయులు దేశ అభివృద్ధిలో వారి పాత్ర అమోఘం అన్నారు. దేశ విదేశాలలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, ఎన్నో ఉన్నత పదవులలో మన వాళ్ళు ఉన్నారంటే అది ఉపాధ్యాయుల గొప్పతనం అన్నారు. అక్షరాస్యతను పెంపొందించడంలో, విద్యార్థులు మంచి మార్గంలో పయనిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవడంలో ఉపాధ్యాయుల పైన ఉన్న బాధ్యత ఎంతో ఉందన్నారు. సమాజ సేవలో జర్నలిస్టు చేస్తున్న సేవలు మరువలేనిమన్నారు. ఎంతోమందికి మేలు జరిగే విధంగా జర్నలిస్టులు చేస్తున్న కృషిని మరువలేనిమన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యన ఉంటూ సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపేవారు జర్నలిస్టులు అన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు సన్మానం…
అందోల్ మండలం చెందిన ఉపాధ్యాయులు నర్సింలు, ప్రభావతి, సాయ గౌడ్, రాములు, యమునా భాయి, వెంకటేశం, రవీందర్, శాంతా కుమారి, ప్రభాకర్, శ్రేయ ప్రవళిక, సునంద, భార్గవి, ఉత్తమ జర్నలిస్టులుగా పవన్ కుమార్, రమేష్, సంతోష్, రాజేష్, సంజీవ్, శ్రీనివాస్, కుమార్, అశోక్, ఉమా శంకర్ లను శాలువా పూలమాలలు మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, లైన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ కే. అనంతరెడ్డి, లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఆకుల రాంబాబు, క్లబ్ కార్యదర్శి పి. సంతోష్, పి ఆర్ టి యు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరోత్తం, రాజమల్లు, మాజీ క్లబ్ అధ్యక్షులు రంగా సురేష్, సభ్యులు మాణిక్ రెడ్డి, మల్లేశం, వ్యాఖ్యాత మౌలానా తదితరులు పాల్గొన్నారు.