ఢిల్లీకి ఆజాద్‌ ప్రయాణం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్‌ హైదరాబాద్‌ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. యూపీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతు కూడ గట్టేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చారు. ప్రత్యేక విమానం లో వచ్చిన ఆజాద్‌ మీడియా కంటా పడకుండా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో గంటపాటు మంతనాలు జరిపారు. అయితే తెలంగాణ అంశం పై మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.