ఢిల్లీ పోలీసులకు నేడు అందనున్న ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదిక
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. ఈ కేసులో ఛార్జిషీట్‌ను బుధవారం నాడు దాఖలు చేస్తామని పోలీసులు తెలియజేశారు. ఇది వెయ్యి పేజీల వరకూ ఉండనున్నట్లు చెప్పారు. అత్యాచార ఘటన బాధితురాలు సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ కేసులో ఆరుగురు నిందితులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.