తమిళనాడులో తీరం దాటిన అల్పపీడనం
కోస్తా,రాయలసీమల్లో భారీ వర్ష హెచ్చరిక
అమరావతి,నవంబర్19(ఆర్ఎన్ఎ): నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి ` చెన్నై సవిూపంలో తీరందాటిందని తెలిపింది. అయితే, వాయు గుండం ప్రభావంతో.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ సవిూపంలో విస్తారంగాను, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో.. తీరంవెంబడి గంటకు 45 నుంచి 65 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. వేటకు వెళ్లకూడదని మత్స్యకారులను అధికారులు ఆదేశించారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహయ కార్యక్రమాలు చేపట్టాయని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే కోడూరు మండలంలో జనజీవనం స్తంభించింది. వాగులు ,వంతెనలు పొంగి ప్రవహించాయి. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు కోతకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద సహాయక చర్యల్లో భాగంగా వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజ రెడి,?డ తహశీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో పటాన్ మహబూబ్ ఖాన్ సిబ్బందితో కలిసి మండలంలో పర్యటించారు. సెట్టిగుంట పంచాయతీ లక్ష్మిప్లలెలో వరద పరిస్థితిని వారు పరిశీలించారు. ఎస్ కొత్తపల్లి పంచాయితీలో కోతకు గురైన రోడ్డును పరిశీలించారు. కోడూరు రెడ్డివారిప్లలె మార్గంలోని వంతెనపై వరదనీరు ప్రవహించడంతో వంతెన క్రింద తూములకు అడ్డుపడిన మొక్కలను ఉప సర్పంచి తోట శివసాయి జెసిబిలు ఏర్పాటుచేసి తొలగించి, వరద నీరు వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. గత రాత్రి పట్టణ ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనము, మందులు సరఫరా చేశారు. మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ తూర్పు ప్లలె సబ్ స్టేషన్ గోడ కూలిపోయి కెపాసిటర్లు కొట్టుకుపోయినట్లు విద్యుత్ శాఖ ఏడి బాలాజీ తెలిపారు. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, జెడ్పిటిసి సభ్యులు పాలెం కోట రత్నమ్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కోడూరు పట్టణంలోని యాక్సిస్ బ్యాంకు క్రింది భాగంలో ఉన్న సన్ సూపర్ మార్కెట్లో వర్షపు నీరు చేరడంతో ఉప సర్పంచ్ తోట శివ సాయి నీటిని తొలగించే ఏర్పాట్లు చేశారు. వరదనీటిలో చిక్కుకున్న వారిని సుక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామ సవిూపం వంక ఏరులో జెసిబిలో ఇరుక్కుపోయిన 11 మందిని హలికాప్టర్ సహాయంతో రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.కనేకల్ మండలంలో వరద నీటిలో మునిగిన పంటలను స్థానిక తహశీల్దార్ శుక్రవారం పరిశీలించారు.త రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కనేకల్ మండలం సొల్లాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో పప్పు శనగ పంట దాదాపు 800 ఎకరాలు నీట మునిగాయి. కనేకల్ చెరువు హెచ్ఎల్సీ కాలువ నీళ్లు వదులే గేట్ల వద్ద హెచ్ఎల్సీ కాలువ గట్టు నెర్రలు చీలడంతో గంగాపురం గ్రామానికి వెళ్లే రహదారిపై స్థానిక తహశీల్దార్ ఉషారాణితో పాటు ఎస్సై దిలీప్ కుమార్ ,హెచ్ఎల్ సి అధికారులు రోడ్డుపై నెర్రెలను పరిశీలించారు. ముఖ్యంగా వరి, మొక్కజన్న పంటలు నేలకొరిగాయి. హనకనహళ్ సొల్లాపురం గ్రామాల మధ్య ప్రవహిస్తున్న వంక వైపు ఎవరు వెళ్ళకూడదని తహశీల్దార్ సూచించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. గుండ్లూరు,శేషమాంబాపురం,మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది నుంచి పెద్ద ఎత్తున నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతోంది. చెయ్యేరు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నందలూరు పరివాహక ప్రాంతంలోని మండపల్లి,ఆకేపాడు, నందలూరు ప్రాంతంలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అధికారులు,పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నందలూరు వద్ద 3 మృతదేహాలను వెలికితీశారు.ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం మూడు జిల్లాల్లో వరద సహాయక పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వరద సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించనున్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద ఉదృతి చేరుతుంది. ఈ ప్రాజెక్ట్ 11 గేట్లను ఎత్తి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. ఇన్ ఎª`లో 3,62,466 క్యూసెక్కులు, ఔట్ ప్లో 3,50,4500 క్యూసెక్కులుగా ఉంది. సోమశిల పూర్తి స్థాయి నీటిమట్టం 77.98, ప్రస్తుతం 71.07 టిఎంసిలుగా ఉంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి`చెన్నై మధ్య తీరం దాటింది. శుక్రవారం ఉదయం 3`4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావంతో తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు.. ఎగువ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో భారీ వర్షాలతో పాపాగ్ని నది పొంగిపోర్లుతోంది. రోడ్డు, దేవాలయ ప్రాంగణం జలమయమ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు కడప జిల్ల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సుండుపల్లి సవిూపంలోని పింఛ, రాజం పేట వద్ద ఉన్న అన్నమయ్య జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అన్నమయ్య ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 1.5 లక్షల క్యూసెక్కుల నీటికి దిగువకు విడిచిపెట్టారు.