తాండూర్ హిందు ఉత్సవ సమితికి రూ. 51 వేల చందా.

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.

 

తాండూరు అగస్టు 22(జనంసాక్షి)తాండూర్ హిందు ఉత్సవ సమితికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటే ల్ భారీ చందాను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా రూ. 51 వేలను హిందు ఉత్సవ సభ్యులకు చందా రాసారు. ప్రతి సారి తాండూర్ పట్టణంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. హిందు ఉత్సవ సమిత సభ్యులు అడిగిన వెంటనే రూ. 51 వేల చందాను ఇస్తామన్నారు.ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ కు హిందు ఉత్సవ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండూర్ హిందు ఉత్సవ సమితి సెక్రటరీ బొట్టు నర్సింహులు, ఉపాధ్యక్షులు పూజారి పాండు, కౌన్సిర్లు వెంకన్నగౌడ్, రాము ,గంగాధర్, కిరణ్, ఆశీష్ తదితరులు ఉన్నారు.