తాగిన మైకంలో ఉరి వేసుకుని ఆత్మహత్య.

 

 

 

 

 

 

 

గుడిహత్నూర్: మార్చ్,9 (జనం సాక్షి)మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన కైరే దత్తా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుఎస్సై.ఎల్. ప్రవీణ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కైరేదత్తా మూడు రోజుల నుండి ఎలాంటి పని చేయకుండా ఇంట్లో ఉండి మద్యం సేవిస్తు ఉండడంతో భార్య పనిచేయకుండా మద్యం సేవిస్తూ ఇంట్లో ఉంటే ఇల్లు ఎలాగడుస్తుందనిమందలించడంతో
భార్యాను తిట్టి ఇంటి నుండి వెళ్ళ
గొట్టగా భార్య పుట్టింటికి వెళ్ళంది. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో తాగిన మైకంలో కైరేదత్తాఆత్మహత్యకు పాల్పడ్డాడని, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.