తెదేపా దీక్షను అడ్డుకున్న వైకాపా నేతలు

కృష్ణా: కృష్ణా డెల్టాకు  నీరు విడుదల చేయాలంటూ నందివాడ మండలం జనార్థనపురంలో తెలుగుదేశం పార్టీ దీక్ష చేపట్టింది. తెదేపా  దీక్షను వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పరస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసులు దీక్ష చేస్తున్న తెదేపా నేతలు, రైతులను అరెస్టు చేశారు.