తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలి: బైరెడ్డి

తిరుపతి : రాయలసీమకు రాష్ట్ర హోదా కోసంపాదయాత్ర చేపట్టనున్నట్టు రాయలసీమ ఐకాస నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రకటించారు. తెలంగాణ అంశం తేల్చేముందు రాయలసీమ విషయం తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. తిరుపతిలో ఆయన పలు విద్యాసంస్థల విద్యార్థులతో సమావేశమయ్యారు. ఉద్యమానికి విద్యార్థుల మద్దతు కోసం రాయలసీమ జిల్లాలో పర్యటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.