దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6  ఈ నెలలో తిరుపతిలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనే వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ నెల 7 నుంచి 29 వరకు తిరుపతిలో జరిగే మహాసభల్లో పాలుపంచుకునే ప్రతినిధులు దరఖాస్తులను పూర్తి చేసి రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రతినిధులుగా పేర్లు నమోదు చేసుకునే వారికి తెలుగు మహాసభల్లో మూడు రోజుల పాటు ఉచిత ప్రవేశంతో పాటు, బస్సు, రవాణా సౌకర్యం, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. దరఖాస్తులు చేసుకునే వారు రూ.500 రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి బ్యాడ్జీ, భోజన కూపన్లు, కిట్‌బ్యాగ్‌, సభలకు చెందిన సమాచారాలు అందించనున్నామన్నారు. వసతి కావాలనుకునే ప్రతినిధులు ఏ స్థాయిలో కావాలో  తెలియజేయాలని ఆయన సూచించారు.