నగదు బదిలీ పథకంపై అధ్యయనం పూర్తి
హైదరాబాద్: నగదు బదిలీ పథకంపై తెలుగు దేశం పార్టీ అధ్యయనం పూర్తి చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలియజేశారు. అధ్యయన నివేదికను అధ్యక్షుడు చంద్రబాబుకు త్వరలో అందజేస్తామని అన్నారు. రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి నగదు బదిలీ పథకమే పరిష్కారమని అన్నారు.