నదుల అనుసంధానంపై ఆదేశాలను పన:సమీక్షించేది లేదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నిర్దిష్ట గడువులోపు నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలంటూ ఫ్రిబ్రవరి 27 న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పున:సమీక్షించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని బుధవారం సుప్రీంకోర్టు
కొట్టెసింది. పున:సమీక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయడంలో జాప్యం జరిగింది. నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయడానికి వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి ప్రతినిధులతో, మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని అప్పట్లో ధర్మాసనం ఆదేశించింది.