నవాజ్‌షరీఫ్‌కు ఒబామా అభినందనలు
వాషింగ్టన్: పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన నవాజ్‌షరీఫ్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోనులో అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో నవాజ్ పార్టీ సాధించిన విజయం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోందని, పౌరప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన పాకిస్తాన్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.


