నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
బీజేపీ మందమర్రి మండల శాఖ డిమాండ్.
తెరాస ప్రభుత్వం 2014 మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని కేసిఆర్ హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటింటి సర్వే చేపట్టి రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పూర్తి సర్వే ప్రభుత్వం చేతిలో ఉంది . ఇల్లు ఉన్న వారెవరు లేని వారెవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసు. కానీ కేసిఆర్ 9 సంవత్సరాలుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని తెలంగాణ ప్రజలను మోసం చేశాడని. దీనికి నిరసనగా బిజెపి మందమర్రి మండల శాఖ అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు మందమర్రి ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణిలో వినతి పత్రం ఇస్తూ నిరుపేద లబ్ధిదారులతో తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తాసిల్దార్ కి ప్రజావాణి స్పెషల్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
పైడి మల్ల నర్సింగ్ మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇండ్లు నిర్మిస్తానని హామీ ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి కేంద్ర ప్రభుత్వం నుండి ( ప్రధాని మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద రెండు లక్షల 50 వేల ఇండ్లను ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు 2014 లో మంజూరు చేశారు ) ఇందులో నుండి ( మందమర్రి మండలానికి 3,000 ఇండ్లు ఇస్తే కేవలం ఖ్యతన్ పల్లి మందమర్రి లో 560 మాత్రమే పూర్తి చేయడం.) అది కూడా లబ్ధిదారులకు అందించలేని పరిస్థితి. కానీ కెసిఆర్ బిజెపి కేంద్ర ప్రభుత్వం పంపిన డబ్బులను పేద ప్రజలకు ఇల్లు కట్టించకుండా డబుల్ బెడ్ రూమ్ పేరుతో ఒక్కో ఇంటి నిర్మాణం ఖర్చు ( 7 లక్షల 50 వేలకు పెంచి. అత్యధికంగా . గజ్వేల్ . సిరిసిల్ల . సిద్దిపేట. నియోజకవర్గాల్లో నిర్మించుకొని తెలంగాణ రాష్ట్ర నిరుపేదలకు అందవలసిన ఇండ్లను పక్కదారి పట్టించి ఇల్లు లేని నిరుపేదలను మోసం చేశాడు.) కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అర కొర చాలీ చాలకుండా ( 200.300. 400. ఇండ్లు నిర్మించారు. కొన్ని ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి.) మంచిర్యాల జిల్లాలో మరియు చెన్నూరు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం పునాదులు కూడా తవ్వలేదు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలను కనీసం అర్హుల జాబితాలో కూడా ప్రకటించలేదు ( కెసిఆర్ ఇచ్చిన హామీ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తా అని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు) , కేవలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నిర్మించడం అది కేవలం నుండి 10 శాతం మాత్రమే నిర్మించడం జరిగింది.
కేటీఆర్ పట్టణ ప్రాంతాల్లో ( సొంత జాగా ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ) అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న ఇంతవరకు ( ఒక్క లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు ఇవ్వలేదు ) ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించడం చేతకాకుంటే ( ప్రధాని నరేంద్ర మోడీ పంపిన ఒక్కో ఇంటి నిర్మాణం రూపాయలు బిజెపి కేంద్ర ప్రభుత్వానికి వాపస్ పంపవలసిందిగా) రేపు ( బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు కట్టిస్తామని తెలియజేస్తున్నాం ) . లేదంటే బిజెపి కేంద్ర ప్రభుత్వం పంపిన ( నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇస్తే వారి స్థలంలో రెండు రూములు నిర్మించుకుంటారు) . మీ రాష్ట్ర ప్రభుత్వం మాకు రూపాయి ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. ( బిజెపి కేంద్ర ప్రభుత్వం పంపిన పైసలు మా పేద ప్రజలకు ఇవ్వండి) . లేదంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వానికి కెసిఆర్ కు బుద్ధి చెప్తారని. ( భారతీయ జనతా పార్టీ మందమరి మండల శాఖ ) తరపున హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు డివి దీక్షితులు. బీజేవైఎం మండల అధ్యక్షులు పెంచాల రంజిత్. మామిడిగట్టు బూతు అధ్యక్షులు సుంకరి రాజేందర్. చిర్రకుంట భూత్ అధ్యక్షులు మారినేని పోశం. ఆదిల్ పేట బూతు అధ్యక్షులు గుర్న రవి. సుద్దాల రాజ్ కుమార్. కాపురపు జంబిడి దిలీప్. దుర్గం మాధవ్. లు పాల్గొన్నారు…………..జనం సాక్షి