నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పాసింజర్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్‌: నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పలు పాసింజర్‌ రైళ్లు రద్దయినావి. సూళ్లురుపేట నెల్లూరు మధ్య నడిచే రెండు ప్యాసింజర్‌ రైళ్లను ధక్షిణమధ్యరైల్వే రద్దు చేసింది. బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌,  గూడురు-విజయవాడ, చెన్నై సెంట్రల్‌-గూడురు, విజయవాడ-బిట్రిగుంట, మధ్య పాసింజర్‌ రైళ్లను రద్దుచేశారు. చెన్నై సెంట్రల్‌-నెల్లూరు మధ్య నడిచే మరో ప్యాసింజర్‌రైలు వేదాయపాలెం-నెల్లూరు మధ్య రద్దు చేశారు. అలాగే తిరుపతి-నుల్లూరు పాసింజర్‌ను గూడురు-నెల్లూరు మధ్య రద్దు చేసి గూడురు-చెన్నై సెంట్రల్‌ మధ్య నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నెల్లూరు-చెన్నై మధ్య నడావాల్సిన మరో పాసింజర్‌ రైలు కూడా నెల్లురు-గూడురు మధ్య రద్దయిందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.