నేటి నుంచి శ్రీవారికి వార్షిక వసంతోత్సవాలు

తిరుమల,ఏప్రిల్‌1 : తిరుమల శ్రీవారికి వార్షిక వసంతోత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మేరుకు తిరుమలలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు శాస్తోక్త్రంగా అంకురార్పణ  చేశారు. వేడుకలను పురస్కరించుకుని 2న తిరుప్పావడ, కల్యాణోత్సవం, వూంజలసేవ, ఆర్జిత బ్ర¬్మత్సవం, సహస్ర దీపాలంకరణ, 3న తోమాల, అర్చన, నిజపాద దర్శనంతో సహా ఇతర ఆర్జిత సేవలను తితిదే రద్దు చేయనుంది. చంద్రగహణం ఏర్పడే 4న స్వామివారికి సుప్రభాతం మినహా ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. ఇదిలావుంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4గంటలు, కాలినడక భక్తులకు 3గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. మరోవైపు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమవుతున్నందున భక్తుల సంఖ్య పెరగిఏ అవకాశాలు ఉన్నాయి. దీంతో  వేసవి రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందించాలని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. వారాంతం శుక్రవారం నుంచి ఆదివారం వరకు యాత్రికుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానంలోని విభాగాధిపతులు తిరుమలలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.  వేసవిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు. గదుల కేటాయింపు,తలనీలాలు స్వీకరణ, త్వరితంగా  శ్రీవారి దర్శనం తదితర అంశాలపై దృష్టి పెట్టారు.   ప్రస్తుతం కంటే అదనంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కాలినడకన కూడా అధిక సంఖ్యలో వచ్చే ఉన్నందున అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు సౌకర్యాలు పెంచాలని ఆదేశించారు.