నేడు పార్లమెంట్‌ ముందుక అత్యాచార నిరోధక బిల్లు

న్యూఢిల్లీ : అత్యాచార నిరోధక బిల్లు నేడు పార్లమెంట్‌ ముందుకు రానుంది. నిన్న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లులో విపక్షాలు సూచించిన సవరణలకు అంగీకరించి బిల్లుకు ఆమోదం తెలిపింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనేందుకు కనీస వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది.