నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే
ఖాట్మండు :
నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు దుర్మర ణం చెందారు. పలువురు తీవ్రంగా గాయప డ్డారు. మృతుల్లో 34 మంతి భారతీయులే. వారిలో 10 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. వీరంతా త్రివేణి ఘాట్‌లో జరిగే ఉత్సవాలకు హజరవడానికి వెళుతున్నారు. పరిమితికి మంచి యాత్రికులను ఎక్కించుకుని ప్రయాణిస్తున్న బస్సు ఖాట్మండ్‌కు 150 కిలోమీటర్ల దూరం, నవల్‌పరసీ జిల్లా, గందక్‌కెనాల్‌ వద్ద బస్సు అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని ఘటనా స్థలం నుంచి మృత దేహాలను వెలికి తీశారు. క్షతగ్రాతులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. బస్సు టాప్‌పై కూడా యాత్రికులు కూర్చున్నారని సుమారు 100 నుంచి 120 మందిని బస్సులో ఎక్కించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.