న్యూజిలాండ్‌ ఘనవిజయం

కండె: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టు మూడు వికెట్ల నష్టానికి 191 పరుగుల చేయగా, బంగ్లాదేశ్‌ 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్‌ జట్టులో మెక్‌కలమ్‌ 123, ఫ్రాంక్లిన్‌ 35 పరుగులు చేశారు. టేలర్‌ 14 పరుగులతో నటౌట్‌గా ఉన్నాడు. బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ జట్టులో రజాక్‌ రెండు, మోర్తజా ఒక వికెట్‌ తీశారు. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో నాజిర్‌ హుస్సేన్‌ 50, మహ్మద్‌ అష్రాపుల్‌ 21, మహమ్మదుల్లా 15 పరుగులు చేయగా రెహ్మాన్‌ 14 పరుగులతో నటౌట్‌గా ఉన్నాడు.