పాకిస్థాన్‌ విజయం

కొలంబొ: పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రేమాదాస స్టేడియంలో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా పాకిస్థాన్‌ 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.